ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను సోమవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం అయిజ రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాబంధులు, దళారీలను రూపుమాపేందుకే ధరణిని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతుబంధు, కరంటు, దళితబంధు ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు బతకలేక, బతుకులేక పాలమూరు నుంచి వలసపోయామని, కానీ ఇప్పుడు పక్కనున్న కర్నూల్ జిల్లా, రాయ్‌చూర్, బీహార్, జార్ఖండ్ నుంచి పాలమూరుకు వలస వస్తున్నారని తెలిపారు. గద్వాల జిల్లా అభివృద్ధి కోసం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
Hyd21
ఎస్పీ సృజనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్త, కలెక్టర్ క్రాంతి, డీజీపీ అంజనీకుమార్
జోగుళాంబ-గద్వాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ క్రాంతి