దసరా కల్లా ఎస్టీపీలను అందుబాటులోకి తేవాలి
- మే నెలాఖరు కల్లా సివిల్ వర్కులు పూర్తవ్వాలి
- నూతన మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎండీ దానకిశోర్
సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణంలో భాగంగా అంబర్‌పేట, నాగోల్‌లో నిర్మిస్తున్న సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణ పనులను శుక్రవారం జలమండలి ఎండీ దానకిశోర్ పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న తీరును ఆయన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. దసరాలోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తయ్యేందుకు 24 గంటలు పనులు చేయాలని, ఇందుకోసం 3 షిఫ్టుల్లో కార్మికులు పని చేసేలా చూసుకోవాలని సూచించారు. అన్ని ఎస్టీపీల నిర్మాణ పనులు దశలవారీగా కాకుండా ఏక కాలంలో జరగాలని పేర్కొన్నారు. ఇందుకు తగిన కార్మికులు, యంత్రాలు, సామగ్రిని సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్మికులు కచ్చితంగా రక్షణ పరికరాలను ఉపయోగించేలా చూడాలని ఆయన సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో వివిధ దశల నిర్మాణ పనుల వివరాలతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాల ని ప్రత్యేకంగా చెప్పారు. చాదర్‌ఘాట్ నుంచి నాగోల్ ఎస్టీపీ వరకు నిర్మించ తలపెట్టిన మెయిన్ సైట్‌ను నాగోల్ బ్రిడ్జి సమీపంలో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన జలమండలి ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఎస్టీపీకి సంబంధించి పూర్తి ప్రాజెక్టు వివరాలు, వర్ షెడ్యూళ్లను రూపొందించుకొని ఆ ప్రకారం ప్రణాళికాబద్ధంగా పనులు చేసి, దసరా వరకు ఎస్టీపీలను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు ఎండీ సూచించారు. మొదటి దశ.. మే నెలలోపు సివిల్ వరులు పూర్తి చేస్తేనే దసరా వరకు ఎస్టీపీలను పూర్తి చేసే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పనులు జరిగేలా చూడాలన్నారు. ఏక కాలంలో ఎస్బీఆర్ (సీక్వెన్ష ల్ బ్యాచ్ రియాక్టర్ ), సీసీటీ (క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్), తదితర పనులను జరపాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్య నారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు, ఎస్టీపీల సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

