అమీర్‌పేట్, నవంబర్ 19 :నగరాభివృద్ధి బీఆర్ఎస్ ఘనతేనని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. నగర ప్రజానీకానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు బీఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో నగరంలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, మెట్రోరైల్ విస్తరణతో పాటు వరదల నియంత్రణకు సైతం ఎస్ఎన్డీపీతో సమగ్రమైన ప్రణాళికలు రచించి నగరానికి కొత్తరూపును తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లదేనన్నారు. ఫలితంగా అనేక బహుళ జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు హార్డ్‌వేర్ కంపెనీలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆస్పత్రులు, విద్యాసంస్థలు, అత్యుత్తమ స్థాయి నిర్మాణ సంస్థలు నగరానికి తరలి వచ్చాయన్నారు.
దీంతో యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో నగరాన్ని అన్ని విధాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లదేనన్నారు. కాగా, ఎస్ఆర్నగర్ నివాసితుల సంఘం, శాంతిబాగ్ అపార్ట్మెంట్స్ నివాసితుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సదస్సుల్లో ఆయన మాజీ కార్పొరేటర్ ఎన్. శేషుకుమారిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ గడిచిన తొమ్మిదన్నరేండ్లలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించామని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చక్కటి సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థలను తీర్చిదిద్దామన్నారు. కాగా, సనత్‌నగర్‌లోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో మంత్రి తలసాని పాల్గొన్నారు.