Ameerpet | అమీర్‌పేట : ఇటీవల కరీంనగర్లో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్ విభాగాల్లో ప్రతిభ చాటిన ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పీసీ ఎం వినయ్‌ని సీఐ సైదులు అభినందించారు. పోటాపోటీగా సాగిన ఈ క్రీడల్లో బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్ 75 కేజీల విభాగాల్లో వినయ్ అత్యుత్తమ ప్రతిభ చాటుతూ బంగారు, వెండి పతకాలు సాధించాడు. ఈ మేరకు బుధవారం ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పీఎస్‌లో జరిగిన కార్యక్రమంలో సీఐ సైదులు సహా స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది వినయ్‌ను అభినందించారు. తన విధులకు ఎక్కడా ఆటంకాలు కలుగకుండా, తన వ్యక్తిగత సమయాల్లో బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్‌లలో సాధన చేస్తుండడంతోనే రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడల్లో ప్రతిభ చాటగలిగానని వినయ్ పేర్కొన్నారు.