25 నుంచి 28 వ తేదీ వరకు..
బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
కీసర, ఏప్రిల్ 14 : చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర తెలిపారు. మండల పరిధిలోని చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గురువారం 14వ వార్షికోత్సవానికి సంబంధించి బ్రోచర్‌ను ఆలయ చైర్మన్, ఎంపీపీ, ఆలయ ధర్మకర్తలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు 4 రోజుల పాటు 14వ వార్షికోత్సవం వేడుకలను నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 27న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు మంత్రి మల్లారెడ్డితో పాటు వీఐపీలు విచ్చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, వేదపండితులు పాల్గొన్నారు.