మొయినాబాద్, మార్చి, 02 : చంద్ర గ్రహణం నేపథ్యంలో రేపు చిలుకూరు బాలాజీ ఆలయం మూసి వేస్తారని చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి 7:30 గంటల వరకు స్వామివారి సేవలు నిర్వహించిన అనంతరం ఆలయం మూసివేస్తారని తెలిపారు.
సాయంత్రం ఏడు గంటలకు ఆలయాన్ని సంప్రోక్షణ చేస్తారని, కానీ భక్తులకు స్వామి వారి దర్శనం ఉండదని పేర్కొన్నారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటల నుంచి స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వారు తెలిపారు.