సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే క్రమంగా తక్కువకు పడిపోతుండడంతో చలిపులి వణికిస్తున్నది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నరగంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీలు తగ్గి..26.6 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.4 డిగ్రీలు తగ్గి..13.6 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 51 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 10.5 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.