సిటీబ్యూరో, జూలై 13 ( నమస్తే తెలంగాణ ) : ఉదయాన్నే నిద్రలేసి..పిల్లలను మేల్కొల్పి..హుటాహుటినా వారిని స్కూల్ కు రెడీ చేసి.. ఏదో ఒకటి వండేసి బాక్స్ ఇచ్చేస్తే..అంతటితో ఆరోజు గట్టెక్కినట్టేనని చాలా మంది తల్లిదండ్రుల భావన. ఇంటికొచ్చాక హోంవర్క్ చేయించడం..చదివించడం.. సరిగా చదవకపోతే గద్దరించడం ఇవే వారికి తెలుసు. అయితే పిల్లలు చదువు, ఆటలు ఇతర యాక్టివిటీస్‌లో రాణించాలన్నా..మానసికంగా, శారీరకంగా ఎదుగుదల సరైనదిగా ఉండాలన్నా అత్యంత కీలకమైనది పోషకాహారం. క్రమశిక్షణతో కూడిన సరైన పోషకాహారం పిల్లలు చురుకుగా ఉండటానికి తోడ్పడుతుందనిపోషకాహారనిపుణులు సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్‌ను తగ్గించి బలవర్ధకమైన ఆహారంపై ఆసక్తి పెరిగేల పిల్లలను మలచాల్సిన బాధ్యత పేరేంట్స్దేనని అన్నారు.
జంక్‌ఫుడ్ వద్దు..
చిన్నారులకు అధికంగా చిప్స్, చాక్లెట్లు, నిల్వ ఆహారాన్ని అధికంగా ఇస్తున్నారు. ఈ పదార్థాలే ఊబకాయం మొదలు చిన్న వయసులోనే మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, ఇతర సమస్యల బారిన పడేల చేస్తున్నాయి. బరువు పెరిగే కొద్దీ బద్దకం ఆవరించి చురుకుదనం లోపిస్తుంది. చదువు మొదలు, ఇతర ఆటల్లోనూ పిల్లలు వెనకబడి పోతారు. పిల్లలకు ఎదిగే కొద్దీ అన్నీ రకాల పోషకాలు సమతూకంలో అందించాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఇంటి ఆహారం నుంచే ఎక్కువగా అందుతాయని పేరేంట్స్ గుర్తుంచుకోవాలి. అలా కాకుండా చిప్స్, బేకరీ పదార్థాలు, ప్రాసెస్ట్ ఆహారం తీసుకోవడం వల్ల వాటిల్లో ఉండే ఉప్పు, మసాలాలు, ఇతర రసాయనాలు చిన్నారుల మొదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా అవసరానికి మించి పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతుంది. పోషకహారలేమి మొదలవుతుంది.
ఈ పోషకాలు ఉండాల్సిందే..
చాలా తక్కువ మొత్తంలో చిన్నారులకు అవసరమయ్యే విటమిన్లు ఖనిజాలను సూక్ష్మపోషకాలు అంటారు. ఇవి మానసిక ఎదుగుదలకు తోడ్పడుతాయి. రోజు పిల్లలకు అందించే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు ఏ మేరకు ఉండాలో ఏయే వయసుల వారికి ఇవి ఎంత మొత్తంలో అవసరం అనేది అవగాహన ఉండాలి. ఇనుము, జింక్, క్యాల్షియం, అయోడిన్, విటమిన్ ఏ, బి,సి వీటిలో ముఖ్యమైనవి. గర్భంతో ఉన్నప్పటి నుంచి ఈ పోషకాలు తల్లి తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు అవన్నీ అందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న చిన్నారుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక సూక్ష్మ పోషకానికి దూరంగా ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. భారత్‌లో ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయస్సు పిల్లల్లో సూక్ష్మపోషకాహార లోపం ఎక్కువగా ఉన్నట్టు యూనిసెఫ్ నివేదికలు సైతం హెచ్చరించాయి.
ఇవి పాటిద్దాం..