ఎల్బీనగర్, ఏప్రిల్ 29: ఆడుకుంటూ వెళ్లి సరూర్గర్ చెరువు లో పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు కు చెందిన పాలకుర్తి శ్రీను, భార్య శ్రావణి సరూర్నగర్ లోని చెరువుకట్టకు అనుకోని ఉన్న గ్రీన్ పార్క్ కాలనీ రోడ్డు నం.14లో నివసిస్తున్నారు. నలుగురు సంతానం కాగా రెండో పాప అభిత (6) సోమవారం మధ్యాహ్నం తల్లి దండ్రులు ఇంటి పక్కన వారితో మాట్లాడుతూ ఉండగా పాప గుడిసె పక్కన గల చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నది.
కొద్దిసేపటి తర్వాత పాప అక్కడ కనిపించక పోవడంతో చుట్టూ పక్కల వెతికినా ఆచూకీ లభించక పోవడంతో సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళ వారం ఉదయం పాప సరూర్నగర్ చెరువులో తేలుతూ కనిపించగా బయటకి తీయగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.