చిక్కడపల్లి, జూన్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అశోక్‌నగర్‌లోని నగర(చిక్కడపల్లి) గ్రంథాలయం వద్ద లైబ్రరీ విద్యార్థులు రిలే దీక్షకు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు లైబ్రెరీ వద్ద ఉదయం నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్ష చేసేందుకు వచ్చే విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు 2 వాహనాలను సైతం సమకూర్చి పెట్టుకున్నారు. మరోవైపు గ్రంథాలయానికి వచ్చిపోయే విద్యార్థులపై నిఘా పెట్టడంతో పాటు అనుమానితులను ప్రశ్నించారు.