బడంగ్‌పేట : మహిళలు స్వశక్తితో ఎదగాలన్నదే రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ వై ఆర్ గార్డెన్లో మహిళా బంధు కేసీఆర్‌కు దన్యావాదాలు తెలిపే కార్యక్రమం కార్పొరేటర్ సిద్దాల లావణ్య బీరప్ప అధ్యక్షతన నిర్వహించారు.
పారిశుద్ధ్య, అంగన్వాడీ, ఆశావర్కర్స్, వైద్య సిబ్బంది, మహిళా కార్పొరేటర్స్, టీఆర్ఎస్ మహిళా విభాగం, కార్పొరేటర్లు ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. అనంతరం మహిళా డాక్టర్లను, పారిశుద్ధ్య కార్మికులను, అంగన్ వాడీ టీచర్లను, మహిళా పోలీసులను, ఆశ వర్కర్లను మంత్రి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్త్రీ శక్తి కింద ఏ శక్తి నిల్వలేదని ఆమె అన్నారు. మహిళలు లేని ప్రపంచం మనుగడ సాధించలేదన్నారు. ప్రతి మహిళ విజయం వెనుక ఒక పురుషుడు ఉంటాడని ఆమె అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నానంటే తనకుమారుల పాత్ర ఎంతో ఉందన్నారు.
వంటింటిలో ఉండే నేను రాజకీయంగా రాణించే క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొవలసి వచ్చిందన్నారు. సహనం, ఓర్పు, ప్రేమ, కరుణ, త్యాగం, కఠినత్వం, ధైర్యం, క్షమా గుణం కల్సిన వారే మహిళలు అన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదన్నారు. పోలీసు వ్యవస్థలో 90 మంది మహిళా ఎస్ఐలు ఉన్నారంటే తెలంగాణ ప్రభుత్వం కల్పించిన 33శాతం రిజర్వేషన్లు కారణం అన్నారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీటీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మహిళా కార్పొరేటర్లు, అక్కి మాదవి, ధనలక్ష్మి రాజు, అరుణ ప్రభాకర్‌రెడ్డి, మహిళా కార్పొరేటర్లు, మహిళా వైద్యులు, సిబ్బంది, ఆశా వర్కర్లు, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, పోలీసులు తదితరులు ఉన్నారు.
కేసీఆర్ చిత్ర పటానికి రాఖీలు
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళాబంధు కార్యక్రమంలో భాగంగా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మహిళా కార్పొరేటర్లు,టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాళ్ళు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్ర పటానికి రాఖీలు కట్టారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాను సారం విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పిలుపుతో కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన మహిళలను సన్మానించారు.