ఎల్బీ నగర్, మే 6: ఈ నెల 12వ తేదీన ఏపీలోని కాకినాడలో నిర్వహించనున్న మాలల మహా రణభేరి సభను జయప్రదం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి పిలుపునిచ్చారు. మాల మహానాడు వ్యవస్థాపకులు పీవీ రావు 73వ జయంతి సందర్భంగా మే 12న కాకినాడ లో జరిగే మాలల మహా రణభేరి పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ పండు అశోక్ తో కలిసి హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మాలల మహా రణభేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాలలు ఒక్కతాటిపైకి రావాలని కోరారు.