Chengicherla | బోడుప్పల్ ఫిబ్రవరి 8: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని చెంగిచెర్ల చింతలచెరువు మురికి కూపంగా మారింది. ఎగువ ప్రాంతంలో ఉన్న ఎంఎల్ఆర్ కాలనీ, ఇందిరానగర్, క్రాంతి కాలనీ ఈదయ నగర్, దత్తాత్రేయ కాలనీ, చెంగిచెర్ల ఓల్డ్ విలేజ్ కాలనీల నుంచి వస్తున్న డ్రైనేజీ నేరుగా చింతలచెరువులోకి చేరడంతో చెరువులోని జలాలు విషపూరితంగా మారుతున్నాయని స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చింతలచెరువులోకి కలుషిత జలాలు రావడంతో అందులో ఉన్న చేపలు మృత్యువాత పడుతున్నాయి. కంప చెట్లు, పిచ్చి మొక్కలు విస్తరించడంతో పరిసర ప్రాంతాలు కంపు కొడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Chinthala Cheruvu1
డ్రైనేజీ అవుట్ లెట్‌ను ఏర్పాటు చేయాలి
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల పరిధిలోని దాదాపు 28 కాలనీల డ్రైనేజీ వాటర్ నేరుగా చింతలచెరువులోకి చేరి పరిసర ప్రాంతాలు దుర్గంధపూరితంగా మారుస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకొని డ్రైనేజ్ అవుట్ లైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.