సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల జరిగిన డిప్యూటీ కమిషనర్ల బదిలీలో ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. పారిశుధ్య విభాగంలో జాయింట్ కమిషనర్లుగా ఉన్న ఇద్దరు డీసీలు తిరిగి సర్కిళ్లకు వెళ్లడంపై అనేక ఆరోపణలు వెలువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే అల్వాల్ డీసీగా బాధ్యతలు తీసుకున్న తిప్పర్తి యాదయ్యను తిరిగి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని శానిటేషన్ -2 విభాగం జాయింట్ కమిషనర్గా నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లిలో యూసీడీ పీడీగా పనిచేస్తున్న బోగేశ్వర్లకు అల్వాల్ డీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నిబంధనల ఉల్లంఘనపై శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయగా..కవాడిగూడ సర్కిల్ కు పుష్పలతను నియమించారు.