హైదరాబాద్ : ఈ నెల 27వ తేదీన చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఈ ఫ్లై ఓవర్‌ను మంగళవారమే ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. 674 మీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్‌ను రూ. 45.29 కోట్ల వ్యయంతో నిర్మించిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, వరంగల్, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు సుమారు 10 నిమిషాల సమయం ఆదాతో పాటు స్థానిక ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తూ చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.