హిమాయత్‌నగర్, మే 26: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసును కొట్టేసిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ రవికుమార్ కథనం ప్రకారం.. లంగర్‌హౌస్ నివాసి బండ మధు గురువారం ఉప్పల్ డిపోకు చెందిన 113 నంబర్ బస్సు ఎక్కి హిమాయత్‌నగర్‌కు వస్తున్నాడు.
లిబర్టీ బస్టాప్‌లో దిగేందుకు అతడు మెట్లపైకి వచ్చాడు. అక్కడే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి అతడి మెడలో ఉన్న ఒకటిన్నర తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. బస్సు దిగిన తర్వాత మెడలోని బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.