కుత్బుల్లాపూర్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు హల్చల్ చేశారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కెవి రెడ్డి నగర్లో వాకింగ్ చేస్తున్న బాలమణి (60 ) మేడలోంచి 5 తులాల చైన్ లాక్కొని పరారయ్యారు.
మరో ఘటనలో ఎన్సీఎల్ సీఎల్ కాలనీలో బస్ కోసం బస్ స్టాప్‌లో వేచిఉన్న ఓ యువతి మెడలో చైన్ స్నాచింగ్‌కు యత్నించగా గొలుసు తెగిపోవడంతో దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. గంటల వ్యవధిలో ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో స్నాచర్లు హల్ చల్ చేయడంతో అలెర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.