సనత్నగర్ : సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి పునర్నిర్మాణ పనుల్లో సోమవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. కార్మికులు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సెంట్రింగ్ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.