శామీర్‌పేట మండల పరిషత్ కార్యాలయంలో, జవహర్‌నగర్ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం
శామీర్‌పేట, మార్చి 28: తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యానన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శామీర్‌పేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రైతులను చిన్నచూపు చూస్తుందని యాసంగిలో పండించిన వరిధాన్యం కొనుగోలు విషయంలో మొండి వైఖరిని అవలంభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు అండగా ప్రజాప్రతినిధులు, అధికారులు నిలుస్తున్నారని తెలిపారు. ముక్తకంఠంతో వరిధాన్యం కొనుగోలు విషయమై తీర్మానాలు చేస్తున్న ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, కో ఆపరేటివ్ చైర్మన్లు, డైరెక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, ఎంపీడీవో వాణి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఏవో రమేశ్, ఏఈవో రవి, డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్లో..
జవహర్‌నగర్:తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మేయర్ మేకల కావ్య డిమాండ్ చేశారు. సోమవారం జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని కౌన్సిల్ సమావేశంలో ధాన్యం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన పత్రులను ప్రధాని నరేంద్రమోదీకి పోస్టు ద్వారా పంపించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.