Hyderabad | పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సున్నితమైన ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వై ప్లస్ సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది భద్రత కల్పించనున్నారు. ఇందులో ఆరుగురు సీఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆమె వెంట నిత్యం పహారా కాస్తారు. మరో ఐదుగురు సాయుధలైన గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు.