హైదరాబాద్ : టీహబ్ ( T Hub )2.0 ప్రారంభోత్సవం సందర్భంగా దేశవిదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దేశ స్టార్టప్ ఎకో సిస్టమ్‌కు టీ హబ్ 2.0 గొప్ప వరమని కితాబిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
– “హైదరాబాద్‌లో కొత్త టీ-హబ్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అభినందనలు. భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇది గొప్ప ఊతమిస్తుంది”
– రతన్ టాటా
– “ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన కేటీఆర్‌కు అభినందనలు. టీహబ్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్!”
– సాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సింధు గంగాధరన్
– హ్యాపనింగ్ హైదరాబాద్‌కు మరో మైలురాయి. ఏసియాలో అతిపెద్ద ఇంక్యుబేటర్ తలుపులు తేరుచుకున్నాయి. అపురూపమైన స్పేస్, అపురూపమైన ఎనర్జీ, అపురూపమైన స్టార్టప్ ఎకోసిస్టమ్.. ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్కు అద్భుతమైన ప్రోత్సహాన్ని అందించనున్నాయి. టీహబ్ ఫేజ్-2కు యూకే ఇన్ హైదరాబాద్ శుభాకాంక్షలు.”
– డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్, ఏపీ అండ్ టీఎస్ యూకే హైకమిషనర్
– “భారత్‌లో ఎంటర్ప్రెన్యూర్షిప్కు మరింత బలం చేకూర్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఉపయోగపడుతుంది. టీ-హబ్ 2.0ను ప్రారంభించిన నా స్నేహితుడు కేటీఆర్, ఆయన బృందానికి శుభాకాంక్షలు”
– గోవా ఎమ్మెల్యే రోహన్ ఖౌంటే
– “మంత్రి కేటీఆర్ ఆలోచన నుంచి పుట్టిన టీహబ్ కొత్త సౌకర్యం హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లడానికి 8 సంవత్సరాలుగా ఎడతెరపిలేకుండా చేస్తున్న ప్రయత్నాల ప్రతిరూపం”
-ఎంపీ రంజిత్‌రెడ్డి
Read More : T HUB | టీ హబ్ -2ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
టీ హబ్-2పై ట్వీట్.. మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం”