హైదరాబాద్ : సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్.. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంకు ఊతమిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. టీ హబ్-2ను రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన విషయం తెలిసిందే.
టీ హబ్-2 ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. కేటీఆర్ కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ భవన నిర్మాణం కూడా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు.
టీ హబ్ -2 భవనం ఎంతగానో ఆకట్టుకుంటుందని సానియా మీర్జా ట్వీట్ చేయగా, అద్భుతంగా ఉందని సైనా నెహ్వాల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ భవనాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సమంత పేర్కొన్నారు. టీ హబ్ భవనం హైదరాబాద్‌కు ఎంతో గర్వకారణం అని సినీ నటుడు సందీప్ కిషన్ పేర్కొన్నారు. కేసీఆర్ సర్ చొరవకు వందనాలు.. భవనాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పీవీ సింధు ట్వీట్ చేశారు.
ఇక గగన్ నారంగ్ స్పందిస్తూ.. నిన్న ఆ భవనం ముందు నుంచి వెళ్తున్నప్పుడు.. దాని చూసి మురిసిపోయాను. ఆ ఫ్యాన్సీ బిల్డింగ్‌ను చూడాలని కారును తిప్పాను. దగ్గరికి వెళ్లి చూడగా అది టీ హబ్ అని అర్థమైపోయింది. కేటీఆర్‌కు వందనాలు అంటూ ట్వీట్ చేశారు.
A recap of how it started!
THub – an initiative of Telangana govt & a brainchild of Minister @KTRTRS
An idea which gave wings to aspirations of scores of young Indians
Started off as India’s Largest Incubator in 2017 & has now transformed into #WorldsLargestInnovationCampus pic.twitter.com/ST7DBGFDdK
— Konatham Dileep (@KonathamDileep) June 26, 2022
So impressive 👏🏽👏🏽👏🏽 https://t.co/NWGSK4PlB7
— Sania Mirza (@MirzaSania) June 26, 2022
Looks amazing sir 🙏🙏 https://t.co/bDdRroQ20F
— Saina Nehwal (@NSaina) June 26, 2022
#HappeningHyderabad
So proud 🙏@KTRTRS https://t.co/8i3U5G8jR9— Samantha (@Samanthaprabhu2) June 26, 2022
Empowering Governance with a VISION!! #HappeningHyderabad #InnovateWithTHub #THub https://t.co/2ay5RTSFOb
— Prakash Raj (@prakashraaj) June 26, 2022
Was passing by this building yesterday and was like Wooooow!!! That’s a fancy building turned my car around to check it out and realised it was @THubHyd Kudos to you @KTRTRS ji for this kind of T-Transformation 👌 https://t.co/9sLpdA1KTR
— Gagan Narang (@gaGunNarang) June 26, 2022
So Proud of Our Hyderabad ♥️@KTRTRS 🤍#THub https://t.co/VLoWdg61Jq
— Sundeep Kishan (@sundeepkishan) June 26, 2022
Brilliant 🇮🇳 @KTRTRS sir, Hoping to come check out the amazing innovation inside post the launch #THub https://t.co/WLZqU70k1v
— Adivi Sesh (@AdiviSesh) June 26, 2022
Super excited! Kudos to @KTRTRS sir for this brilliant initiative. Hyderabad ❤️ https://t.co/gPxFp9ZBby
— Pvsindhu (@Pvsindhu1) June 26, 2022