సిటీబ్యూరో, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్‌లో (CDFD,) పోస్ట్ డాక్టరేట్ చదివేందుకు నోటిఫికేషన్(Ph.D notification) జారీ చేసింది. సెల్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ, జెనిటిక్స్ , ఏపీజెనిటిక్స్, ట్రాన్స్క్రిప్షన్ అండ్ క్రోమాటిన్ బయాలజీ, కంప్యూటేషనల్ బయాలజీ, మాలిక్యూలార్ మైక్రోబయాలజీ, డిసీజ్ ఇన్ఫెక్షన్ బయాలజీ, న్యూరోబయాలజీ, ఇమ్యూనోలాజీ వంటి రంగాల్లో పరిశోధనలకు అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ 24వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా..అర్హత కలిగినవారు సీడీఎఫ్‌డీని సంప్రదించాలని పేర్కొన్నారు. http://14.139.82.220/apps/rep-2-2024/ ద్వారా లింక్ లేదా సీడీఎఫ్‌డీ వెబ్‌సైట్‌ను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని వెల్లడించారు.