సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
నగరంలో నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- పోలీసింగ్‌లో భాగంగా 1039 సైతంలో భాగంగా 6221 ఏర్పాటు
మూసాపేట, డిసెంబర్11: నగరంలో నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందిన కూకట్‌పల్లిలో నేరాల సంఖ్యను అదుపులో పెట్టడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 1039 సీసీ కెమెరాలు, నేను సైతంలో భాగంగా 6221 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిత్యం పెట్రోలింగ్, 24 గంటలు సీసీ టీవి కెమెరాల పర్యవేక్షణతో నేరాల కట్టడికి కృషి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల కేసుల మిస్టరీ ఛేదించడంలో కెమెరాల పాత్ర ఉన్నది. కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా లాభాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆయా పరిసరాలలో ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత రెట్టింపు
సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే కమ్యూనిటీ పోలీసింగ్‌లో 1039, నేను సైతంలో భాగంగా 6221 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. కూకట్పల్లి ఠాణ పరిధిలోని బస్తీలు, కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో సమవేశాలు ఏర్పాటు చేసి కాలనీవాసులకు సీసీటీవి కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. కెమెరాల ఏర్పాటు తర్వాత మిస్టరీ కేసులను త్వరితంగా ఛేదించగలుగుతున్నాం.
– సీఐ నర్సింగ్‌రావు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

