జవహర్‌నగర్, ఫిబ్రవరి 13: అంబేద్కర్‌నగర్ నుంచి శాంతినగర్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు సమస్యతో స్థానికులు నరకయాతన అనుభవించేవారు. సుమారు 30వేల మంది నిరుపేదలు నివసించే కాలనీలో ప్రధాన రోడ్డు సరిగా లేకపోవడంతో వారు పడ్డ్డ కష్టాలను చూసిన మంత్రి మల్లారెడ్డి స్వయంగా రోడ్డు దుస్థితిని చూసి చలించిపోయి… వెంటనే రోడ్డు వేయాలని ఆదేశించడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి..30ఏండ్ల నుంచి అనుభవిస్తున్న సమస్యకు మంత్రి శాశ్వత పరిష్కారం చేపినందుకు స్థానికుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంబేద్కర్‌నగర్ నుంచి శాంతినగర్ వెళ్లాలంటే..
అంబేద్కర్‌నగర్ నుంచి శాంతినగర్‌కు వెళ్లాలంటేఫీట్ల లోతు గుంతల రోడ్డుపై ప్రయాణం సాగేది. వర్షాకాలం వచ్చిందంటే నడవలేని స్థితిలో రోడ్డు ఉండేది. వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోయిన సంఘటనలు కోకొల్లలు. చీకట్లో వెళ్లాలంటే వాహనదారులు గుంతల్లో పడి దవాఖానల పాలైన ఘటనలు మరువలేనివి.
మంత్రి మల్లారెడ్డి చొరవతో..శరవేగంగా పనులు
మంత్రి మల్లారెడ్డి పాదయాత్రలో స్వయంగా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇంతటి దుర్భరస్థితిలో ప్రజలుఎలా నివసిస్తున్నారు…అంటూ చలించిపోయారు. ఈ రోడ్డులో వాహనదారులు ప్రయాణం ఎట్లా సాగిస్తున్నారంటూ..వెంటనే అంబేద్కర్‌నగర్ నుంచి శాంతినగర్ వరకు 2కిలోమీటర్ల వరకు రోడ్డు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరుసటి రోజే పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు ప్రారంభించారు. విశాలమైన సీసీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
గతంలో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే చాలా బాధలు పడేటోళ్లం. జీవితంలో సీసీ రోడ్డును చూడ ను అనుకున్నా. తెలంగాణ ప్రభుత్వం సీసీ రోడ్డును వేస్తుడటంతో మా బాధలు ఇక తప్పనున్నాయి. మంత్రి మల్లారెడ్డి సార్ మా తిప్పలు స్వయంగా చూసి వెంటనే రోడ్డు వేయాలనే ఆలోచన రావడం… వెంటనే పనులు కావడం మా అదృష్టం. గత ప్రభుత్వాలు పట్టించుకోని రోడ్డు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చరిత్రను సృష్టించింది.
– స్వప్న, ప్రైవేటీ ఉద్యోగి, వైఎస్ఆర్నగర్
అవస్థలు శాశ్వతంగా తప్పాయి..
30ఏండ్ల నుంచి శాంతినగర్‌లోనే నివసిస్తున్నాను. రహదారి లేక నరకయాతన అనుభవించాం. ప్రధాన రోడ్డుపై వెళ్లాలంటే చాలా అవస్థలు పడే వాళ్లం పూర్తిగా నిరుపేదలే నివసించే కాలనీల్లో అవసరాల కోసం బయటకు వెళ్లాలంటే తిప్పలు తప్పవికాదు. సీసీ రోడ్డుతో శాశ్వత పరిష్కారం చూపినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రజల బాధలు తెలిసిన మంత్రి మల్లారెడ్డి సార్‌కు ఎప్పటికి రుణపడి ఉంటాం.
– స్వామి, శాంతినగర్
జవహర్‌నగర్‌ను మోడల్ సిటీగా మారుస్తా..
జవహర్‌నగర్ కార్పొరేషన్‌ను మోడల్ సిటీగా మారుస్తా. అంబేద్కర్‌నగర్ నుంచి శాంతినగర్‌కు వెళ్లే రహదారి మోకాళ్లలోతు గుంతలతో అధ్వానంగా ఉండేది. గత ప్రభుత్వాలు ఇటువైపు కన్నెతి కూడా చూడలేదు. మంత్రి మల్లారెడ్డి స్వయంగా చూసి వెంటనే పనులు చేయాలని ఆదేశించడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కార్పొరేషన్‌లోని 28 డివిజన్ల అభివృద్ధికి సమప్రాధాన్యతను కల్పిస్తూ ప్రగతి పనులతో పరుగులు పెడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి సహకారంతో రాష్ట్రంలోనే ఆదర్శ కార్పొరేషన్‌గా మారుస్తా.
– జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య