అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పెంపుడు పిల్లి కనిపించడం లేదంటూ హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నివాసముంటున్న ఓ ఫ్యామిలీ తెగ టెన్షన్ పడుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో నివాసం ఉండే అభిరాజ్.. ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. అప్పుడు తన పిల్లి ఇంట్లోనే ఉంది. కానీ.. ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి.. తన పెంపుడు పిల్లి కనిపించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు అభిరాజ్కు.
25 ఏళ్ల అభిరాజ్.. వ్యాపారవేత్త. తనకు అదంటే ప్రాణం. రెండేళ్ల వయసు ఉన్న ఆ పిల్లి పేరు జోయా. గురువారం నుంచి తన పెంపుడు పిల్లి కనిపించడం లేదని.. సీసీటీవీ కెమెరాలో చూస్తే.. ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నట్టు కనిపించిందని.. ఎవరికైనా జోయా కనిపిస్తే వెంటనే తెచ్చివ్వాలని.. జోయాను తీసుకొచ్చిన వారికి.. 20 వేల రూపాయల రివార్డు కూడా అందిస్తానని అభిరాజ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
ఆ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్లో ఆరెంజ్, బ్లాక్ ప్యాచెస్తో పిల్లి ఉంటుందని.. పిల్లి ఆచూకి తెలిసిన వాళ్లు 9014003870/ 8897255222/9136510836/8978089494 ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేయాలని అభిరాజ్ కోరాడు.