హామీల ఎగవేతలు, పాలనా వైఫల్యాలు, సమన్వయం లేని మంత్రులు, పట్టించుకోని అధికారులు, దిక్కూమొక్కూ లేక బిక్కుబిక్కుమంటున్న జనం.. కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలన ఇదే! ఈ తరుణంలో ‘చాణక్య స్ట్రాటజీస్’ సంస్థ నిర్వహించిన సర్వే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న దని, మెజారిటీ జనం బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని తేల్చింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి చేతులెత్తేసిన రేవంత్ పాలనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని తెలంగాణ ప్రజానీకం ఘంటాపథంగా తేల్చిచెప్పింది. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తామని స్పష్టం చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ‘చాణక్య స్ట్రాటజీస్’ సర్వే తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,06,810 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించిన ఈ సర్వే లో గులాబీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. 40.7 శాతం ఓట్ షేర్‌తో బీఆర్ఎస్ ముందంజలో ఉండటం.. 37.1 శాతంతో కాంగ్రెస్ వెనుకబడటం. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ 3.6 శాతం ఆధిక్యంలో ఉండటం తెలంగాణలో అధికార మార్పు దిశగా సంకేతాలు బలపడుతున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నది.
సర్వే అంచనా ప్రకారం.. వచ్చే అసెంబ్లీ ఎ న్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగురడం తథ్యమని ఈ ఫలితాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ.. ప్రజల నాడి ఏంది? వచ్చే ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతున్నది? ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉన్నది? యువత ఆలోచన ఏంది? వంటి అంశాలపై ‘చాణక్య స్ట్రాటజీస్’ నిర్వహించిన రెండు నెలల సమగ్ర క్షేత్రస్థాయి సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వ పనితీరు వరకు.. ప్రతిపక్ష పార్టీల తీరు నుంచి గ్రామీణ సమస్యల దాకా.. సంక్షే మ పథకాలు, అభివృద్ధి, జెన్ జీ ఆలోచనలు, ఉద్యమకారుల సమస్యలు, నిరుద్యోగం, కొత్త రాజకీయ పార్టీల ప్రభావం వంటి పలు అంశాలను సర్వేలో పరిశీలించినట్టు సంస్థ తెలిపింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న యువ ఓటర్లలో బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం కనిపిస్తున్నది. ముఖ్యంగా జెన్‌జీ ఓటర్లు బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని సర్వే వెల్లడించింది. ఆ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ వైపు మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేరొన్నది. 50 ఏండ్ల్లకు పైబడిన ఓటర్లలోనూ బీఆర్ఎస్కు గట్టి మద్దతు ఉన్నట్టు సర్వే తేల్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నదని, యువత, పట్టణ ఓటర్ల ఆకాంక్షలను ప్రభు త్వం పూర్తిస్థాయిలో అందుకోలేకపోయిందన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. బీజేపీకి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. దాని గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నదని సర్వే పేరొన్నది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో గతంతో పోలిస్తే పార్టీ బలహీనపడినట్టు వెల్లడించింది. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూ బీఆర్ఎస్ దూసుకుపోతుందని సర్వే అం చనా వేసింది. సైబరాబాద్, మలాజిగిరి కార్పొరేషన్లలో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు ఎకువ ఉన్నాయని పేర్కొన్నది.
సర్వే నివేదిక ప్రకారం.. బీఆర్ఎస్ గ్రాఫ్ కాంగ్రెస్ కంటే పెరిగినట్టు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ గ్రాఫ్ గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు సర్వే అంచనా వేసింది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనున్న జెన్‌జీ ఓటర్లపై సర్వే ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ ఓటర్లు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారని.. అయితే ఒక బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని సర్వేలో తేలినట్టు సంస్థ పేర్కొన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఓటర్ల అభిప్రాయాల్లో తేడా కనిపించినట్టు వెల్లడించింది. బీపీఎల్ ఓట టర్లు కాంగ్రెస్‌కు కొంత అనుకూలంగా ఉన్న ట్టు, అదే సమయంలో ఏపీఎల్ వర్గాల్లో కొంత స్తబ్దత వాతావరణం కనిపిస్తున్నట్టు తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పలు అంశాలు ఉన్నట్టు సర్వే గుర్తించింది. ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్టు సర్వే సంస్థ పేరొన్నది. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం కూడా ప్రతికూల అంశంగా మారిందని తెలిపింది. రైతుబంధు, రైతుబీమా పథకాలపై రైతుల్లో అసంతృప్తి ఏర్పడినట్టు సర్వే వెల్లడించింది. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిషరించే తీరుపై అసంతృప్తి ఉన్నదని పేరొన్నది. రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చిన మార్పులు, ఆ రంగంపై ప్రజల్లో పెరిగిన ఆందోళన కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతున్నది. హైడ్రా ప్రభావం, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై నెలకొన్న భయం ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నట్టు సంస్థ పేర్కొన్నది.
గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదనే భావన ప్రజల్లో ఉన్నట్టు సర్వే తెలిపింది. స్థానిక ఎమ్మెల్యేలు యువతను ఆకట్టుకునే స్థాయిలో పనిచేయడం లేదనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నదని పేర్కొన్నది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం పలు హామీలు ఇచ్చి నా.. అవి పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం అసంతృప్తికి కారణమవుతున్నది. 22ఏ అం శం కారణంగా ప్రజల్లో ఆందోళన ఏర్పడినట్టు కూడా సర్వే వెల్లడించింది.
మహిళలకు ఉచిత బస్సు, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, కొంత వరకు ఉద్యోగాల కల్పన, రైతులకు బోనస్, కొంత వరకు జరిగిన రుణమాఫీ, మహిళలకు కొంత మేరకు ఉపాధి కల్పన వంటి అంశాలు కాంగ్రెస్ సర్కార్‌కు కొంత సానుకూలంగా ఉన్నాయని సర్వే సంస్థ అభిప్రాయపడింది. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుండటం..బీజేపీ గ్రాఫ్ తగ్గడం.. జెన్‌జీ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూడటం.. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, గ్రామీణ ఓటర్లలోని అసంతృప్తి రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలుగా మారనున్నాయి. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ఈ సర్వే ప్రతిబింబించినట్టు చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది.
ఉమ్మడి జిల్లాలవారీగా ఎమ్మెల్యేల ర్యాంకులు సైతం సర్వే విశ్లేషించింది. మెదక్‌లోని 10 నియోజకవర్గాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తొలి మూడుస్థానాల్లో నిలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాయల్ శంకర్ ఒకటి, కే ప్రేమ్‌సాగర్‌రావు రెండు, గడ్డం వివేక్ మూడో ర్యాంకు లో నిలిచారు. ఉమ్మడి నిజామాబాద్‌లో సూర్యనారాయణగుప్తా, సుదర్శన్‌రెడ్డి, కేవీ రమణారెడ్డి.. మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి.. హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్‌యాదవ్, నవీన్‌యాదవ్, అక్బరుద్దీన్ ఒవైసీ.. రంగారెడ్డిలో అరికెపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్.. కరీంనగర్లో కేటీఆర్, విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్.. వరంగల్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి.. నల్లగొండలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం.. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రా వు, భట్టి విక్రమార్క తొలి మూడు ర్యాంకుల్లో నిలిచినట్టు సర్వే వెల్లడించింది.