రూ.37.23 కోట్ల నగదు సీజ్
ఎన్నికల నియమావళిలో భాగంగా శనివారం ఫ్లయింగ్ స్కాడ్ రూ.3లక్షల నగదును సీజ్ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
- ఎన్నిక నియమాళికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్
సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ఎన్నికల నియమావళిలో భాగంగా శనివారం ఫ్లయింగ్ స్కాడ్ రూ.3లక్షల నగదును సీజ్ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్ స్వాడ్ ద్వారా ఇప్పటి వరకు రూ.1,15,03,970 నగదు, పోలీసు అథారిటీ ద్వారా రూ.1,78,17,148 సీజ్ చేయగా.. మొత్తం రూ.37,23,30,006 నగదు సీజ్ చేశామని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఇప్పటి వరకు 4,316 సేకరించారని, సీఆర్పీసీ కింద శనివారం 51 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 444 కేసులు నమోదయ్యాయి. శనివారం 134 మందిని బైండోవర్ చేయగా, ఇప్పటి వరకు మొత్తం 1215 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎంసీసీ ఉల్లంఘన కింద గోడలపై ఉన్న రాతలను, పోస్టర్లను ఇప్పటి వరకు 67330 తొలగించామని, అదేవిధంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు మాస్కులు వేయడం జరిగిందని, ఇందులో సుమారు 72,704 విగ్రహాలున్నాయని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలపై శనివారం ఒక కేసు నమోదు కాగా, ఇప్పటి వరకు 9 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఈరోజు 308 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేయగా, మొత్తం 5397 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేశామని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

