సిటీబ్యూరో/చాదర్‌ఘాట్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఎన్నికల నిర్వహణ అధికారులు ఇస్తున్న ఫిర్యాదుల మేరకు మలక్‌పేట, యాకుత్‌పురా, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు, ఆయా పార్టీల అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీ రోహిత్ రాజ్ వివరాలను వెల్లడించారు.