Hyderabad | స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిపై కేసు
కేసుకు సంబంధించి రాజీ విషయంలో చోటు చేసుకున్న వాగ్వాదంలో ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బంజారాహిల్స్,మే 19 : కేసుకు సంబంధించి రాజీ విషయంలో చోటు చేసుకున్న వాగ్వాదంలో ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని షౌకత్‌నగర్‌కు చెందిన ఐమన్ పాషా(22) అనే యువకుడికి మౌలాలిలో నివాసం ఉంటున్న ఫయాజ్ (23) అనే యువకుడితో స్నేహం ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై కేసు నమోదయింది. సోమవారం రాత్రి వీరిద్దరూ మద్యం సేవించి బంజారాహిల్స్ రోడ్ నెం 3లో బైక్‌మీద వెళ్తున్నారు.
గతంలో నమోదయిన కేసులో రాజీ పడితే బాగుంటుందని ఐమన్ పాషా సూచించడంతో ఇద్దరి మద్యన వాగ్వాదం ప్రారంభమయింది. దీంతో ఆగ్రహానికి లోనయిన ఫయాజ్ తనచేతిలోని కత్తితో ఐమన్ పాషాపై దాడి చేయడంతో మెడకు స్వల్పగాయమయింది. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

