Rains | హైదరాబాద్ : భారీ వర్షం ధాటికి హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. నగర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. కుండబోత వర్షం ధాటికి పలు ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. యూసుఫ్‌గూడలో వరదనీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జూబ్లీహిల్స్ టు యూసుఫ్ గూడ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. చాలా వరకు వాహనాలు, బైకులు వరద నీటిలో మునిగిపోయి దెబ్బతిన్నాయి. వాహనవారులు ఈ మార్గం నుంచి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లాలని పోలీసులు, అధికారులు సూచించారు.
భారీ వర్షంతో అమీర్‌పేట మెట్రోస్టేషన్ కింద మరోసారి మోకాళ్ల లోతు వరద నీరు చేరుకుంది. వరద నీటిలో కార్లు పడవల్లా వెళ్తున్న దృశ్యాలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. మెయిన్ రోడ్డు చెరువుగా మారడంతో అటుగా వెళ్తున్న కొందరు యువకులు వరద నీటిలో జలకాలాడిన దృశ్యాలు కనిపించాయి.
మరోవైపు రాబోయే 3 గంటల్లో నల్గొండ, యాదాద్రి – భువనగిరి, సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మంలలో ప్రమాదకరమైన తుఫానులు సంభవించే అవకాశమున్నట్టు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో వచ్చే 1 గంటలో తేలికపాటి – మోస్తరు వర్షాలు పడే అవకాశముందని…రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదికల ద్వారా తెలుస్తోంది.
RURAL TG SEVERE RAIN WARNING ⚠️
DANGEROUS STORMS happening in Nalgonda, Yadadri – Bhongir, Sangareddy to cover Siddipet, Medak, Jangaon, Hanmakonda, Warangal, Mahabubabad, Suryapet, Khammam next 3hrs ⚠️⛈️⚠️🙏
LIGHT – MODERATE rains to continue in Hyderabad City next 1hr.…
— Telangana Weatherman (@balaji25_t) August 7, 2025
మళ్లీ వర్షసూచనల నేపథ్యంలో ఇప్పటికే ఎమర్జెనీ బృందాలు అప్రమత్తం అయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడిక్కడ స్తంభించిన పోయిన వాహనాలను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు భారీ వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనుల్లో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
Hi all,
Jubilee hills to Yusufguda Road is totally blocked, there huge water flow at yusufguda. Kindly avoide this Route. Many cars and bikes got damaged.
Pleass note.@balaji25_t @Tech_glareOffl @CYBTRAFFIC
— CA Krishna Vardhan Reddy ➐ (@krishna_979) August 7, 2025