ORR | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 9 : ఔటర్ రింగ్ రోడ్డుపై కొంత మంది యువకులు రెచ్చిపోయారు. లగ్జరికార్లను గింగిరాలు తిప్పుతూ రేసింగ్లు నిర్వహిస్తు సీసీ కెమెరాలకు చిక్కారు. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని తొండుపల్లి టోల్గేట్ నుంచి పెద్దగోల్కొండ మధ్యలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కార్లను గింగిరాలుగా నడిరోడ్డులో తిప్పుతూ ఇతర వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ యువకులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహిస్తున్న యువకులు
తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్న యువకులు
నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో స్టంట్ లు చేస్తూ హంగామా చేస్తున్న యువకులు
నడిరోడ్డుపైనే లక్జరీ కార్లతో స్టంట్ లు చేస్తున్న యువకులు pic.twitter.com/i9Pyhzi11Q
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025