PVNR Express Way | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని కారులో నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కారును కూడా పక్కకు తీశారు.
ఈ ప్రమాదం అత్తాపూర్ వద్ద చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వైపు కారు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి అతి వేగమే కారణమన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.