సిటీబ్యూరో, నవంబరు 13(నమస్తే తెలంగాణ): మెట్రో రైలులో ప్రయాణికుల భద్రతపై వినూత్న తరహా లో ప్రచార కార్యక్రమాన్ని ఎల్ అండ్ టీ మెట్రో చేపట్టిం ది. టీవీలో ఎంతో పాపులరైన బిగ్బాస్ టీంతో కలిసి నగరంలోని 57 మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల భద్రత కో సం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లలోని కాన్కోర్స్, ఎంట్రీ, ఎగ్జిట్, చెక్ ఇన్ ప్రాంగణాల్లో ప్రయాణికులకు ముందు జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రచారాన్ని చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్తో పాటు అదే తరహా సందేశాలను అన్ని మెట్రో రైళ్లలో వినిపించేలా చేస్తున్నట్టు, ఈ ప్రచారంతో స్మార్ట్ ట్రావెల్ అలవాట్లను ప్రయాణికుల నడుమ పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని కేవీబీ రెడ్డి తెలిపారు.