సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో బస్పాస్కు సంబంధించిన సెక్షన్ను సికింద్రాబాద్లోని రేతిఫైల్లో రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తుకు మార్చారు. ఈ మేరకు శుక్రవారం నూతన బస్పాస్ సెక్షన్ను ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ యాదగిరి ప్రారంభించారు.
దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయ అధికారి సీహెచ్ వెంకన్న, డిప్యూటీ ఆర్ఎంవో టీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.