Hyderabad Metro | హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్లో 12 ఏళ్ల బాలుడి బ్యాగులో బుల్లెట్ లభించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ బాలుడు కూకట్పల్లి సమీపంలోని ప్రగతినగర్ పరిధిలో తన తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఉండటం ఇష్టం లేని బాలుడు మూసాపేట మెట్రోకు ఒక బ్యాగ్‌తో వచ్చాడు.
చెకింగ్ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది 9ఎంఎం బుల్లెట్‌ను గుర్తించారు. వెంటనే మెట్రో ఇంచార్జికి సమాచారం అందించారు. దీనిపై మెట్రో అధికారులు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా, తన తాత మిలటరీలో పనిచేసేవాడని.. తన ఇంట్లో ఉన్న బుల్లెట్నే తీసుకొచ్చానని బాలుడు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.