బడుగులపైకి బుల్డోజర్
పేదలపై మరోసారి బుల్డోజర్తో విరుచుకుపడ్డారు. వీధి వ్యాపారాలతో జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డునపడేశారు. మియాపూర్ మెట్రో సమీపంలోని సోఫా దుకాణాలను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసు పహారా మధ్య యంత్రాల సాయంతో నేలమట్టం చేశారు.
- సీఎం మీటింగ్ కోసం పేదలపై ప్రతాపం
- మియాపూర్లో పలు దుకాణాల కూల్చివేత
మియాపూర్: పేదలపై మరోసారి బుల్డోజర్తో విరుచుకుపడ్డారు. వీధి వ్యాపారాలతో జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డునపడేశారు. మియాపూర్ మెట్రో సమీపంలోని సోఫా దుకాణాలను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసు పహారా మధ్య యంత్రాల సాయంతో నేలమట్టం చేశారు. ఏండ్ల తరబడి సోఫా విక్రయాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఈ అంశంపై కోర్టులో కేసు కొనసాగుతున్నా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా తమ దుకాణాలను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం సీఎం సమావేశం పేరుతో దుకాణాలను కూల్చివేసి వందలాది కుటుంబాలను రోడ్డుమీద పడేశారని బాధితులు వాపోయారు. ‘ప్రాధేయపడినా.. వినకుండా మమ్మల్నీ ఈడ్చేసి దుకాణాలను కూలగొట్టి మా పొట్టకొట్టారు. సీఎం సమావేశం కోసం మా దుకాణాలనే ఎందుకు తొలగించారు. మా వీధి వ్యాపారాలపై కోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ దానిని పరిగణనలోకి తీసుకోకుండా నోటీసు లేకుండా కూల్చివేయడం దారుణం’.అని బాధితుడు ఏడుకొండలు వాపాయారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

