బంజారాహిల్స్,ఫిబ్రవరి 6 : సరదాగా అలవాటైన గంజాయి వ్యసనానికి బానిసైన ఓ బీటెక్(BTech student) విద్యార్థి గంజాయి విక్రేతగా(Ganja selling) మారి కటకటాల పాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన కే.సోమేశ్వర్రెడ్డి(22) కృష్ణానగర్లో నివాసం ఉంటున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుకుంటున్న సోమేశ్వర్రెడ్డికి గత కొంతకాలంగా స్నేహితుల కారణంగా గంజాయి అలవాటయింది.
తరచూ గంజాయి సేవించడంతో పాటు దాన్ని అమ్మి డబ్బులు సంపాదించడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్(Jubilee Hills) రోడ్ నెం 5లోని మెట్రోస్టేషన్ సమీపంలో గంజాయి అమ్మేందుకు వచ్చిన సోమేశ్వర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 170 గ్రాముల గంజాయి లభించింది. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు.