హైదరాబాద్ : హైదరాబాద్లో(Hyderabad)శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ఓ వైపు పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టిస్తుంటే మరో వైపు రాత్రయితే రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. భౌతిక దాడులు చేస్తూ హత్యలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజులుగా నగరంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో మాజీ ఎంపీటీసీ ( Former MPTC Mahesh) దారుణ హత్యకు(Brutal murder) గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతున్నది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ (Ghatkesar)పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదు. దీంతో అతడి సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా ఎన్ఎఫ్సీ నగర్ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.