మేడ్చల్, మే 19 : మేడ్చల్ మరో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడిని మరో యువకుడు కత్తితోపొడిచి హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు పక్కనే ఉన్న సరస్వతీనగర్‌లో గుజరాత్‌కు చెందిన సోలంకి మోతీలాల్(43) అద్దె ఇంట్లో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మరో ఇంట్లో తన మేనత్త కొడుకు అయిన శంకర్ నివాసముంటున్నాడు.
శంకర్ ఆదివారం మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ తన నివాస గృహానికి పక్కనే ఉండే రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాం వద్ద పడుకున్నాడు. ఇది గుర్తించిన మోతీలాల్ మరో వ్యక్తితో కలిసి శంకర్ వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో గొడవ పడవద్దని నచ్చచెబుతూ అక్కడి నుంచి తీసుకువచ్చి ఇంట్లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఇరువురి మద్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శంకర్ మోతీలాల్‌ను దుర్భాషలాడాడు. మరుసటి రోజు సోమవారం ఉదయం మోతీలాల్ తన బంధువుల ఇంటికి వెళ్తుండగా శంకర్ రాత్రి విషయాన్ని మనసులో పెట్టుకొని దుర్భాషలాడాడు.
ఈ విషయాన్ని అతడి తల్లికి చెబుదామని వెళ్తుండగా ఆవేశంతో శంకర్ వెనుక నుంచి వచ్చి మోతీలాల్‌ను కత్తితో కడుపులో పొడిచాడు. గాయపడ్డ మోతీలాల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న సీఐ సత్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల బృందాలను కేటాయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.