సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభు త్వం, సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పరీవాహక ప్రాంతంలోని పేద ల ఇండ్లను చెరబట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యా దవ్ మండిపడ్డారు. బీఆర్ఎస్వీ చేపట్టిన మూసీ పోరుబాటలో భాగంగా గురవారం ఆయన ముసారాంబాగ్ పరిధిలోని బస్తీలను సందర్శించారు. బఫర్‌జోన్ పేరిట బస్తీలకు మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట చేస్తున్న రూ. లక్షన్నర కోట్ల దోపిడీని బాధితులకు వివరించారు.
మూసీ పరీవాహకంలోని ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని బీఆర్ఎస్ పార్టీ, విద్యార్థి విభాగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం, అరాచకాలను వివరిస్తున్నామని తెలిపారు. బాధితులెవరూ అధైర్యపడొద్దని, కాంగ్రెస్ సర్కారు ఇండ్లను కూల్చేందుకు బుల్డోజర్లను పంపిస్తే వాటికి అడ్డంపడి అడ్డుకుంటామన్నారు. బస్తీల పేదల పక్షాన నిలబడి ప్రభుత్వం ప్రజాధనాన్ని బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకుండా అడ్డుకుంటామని వెల్లడించారు.
దశాబ్దాల నుంచి మూసీ పరీవాహకంలో నివసిస్తున్నా ఎలాంటి వరదలు రాలేదని, తమకు ఎలాంటి ఇబ్బందుల్లేవని ప్రజలు చెప్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం ఆయన అనుకూల కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ఇండ్లను ఖాళీ చేయాలని చెబుతున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రూ.లక్షన్నర కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ శక్తులు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ బాధితుల్లో చైతన్యం నింపి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా కొట్లాడుతామని స్పష్టం చేశారు.
మనోధైర్యం నింపుతూ..
ఆరు రోజులుగా బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలు మూసీ పరీవాహక బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరిట కాం గ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీని ఎండగడుతున్నారు. బాధితులకు ప్రభుత్వ కుట్రలను వివరిస్తున్నారు. ఇండ్లను కూల్చనీయకుండా బీఆర్ఎస్తో పాటు విద్యార్థి విభాగం అండగా నిలబడుతుందని భరోసా కల్పిస్తున్నారు. బీఆర్ఎస్వీ మూసీ పోరుబాటలో భాగంగా ముసారంబాగ్‌లో పరిధిలోని శాలివాహననగర్, వాంబే బస్తీ లో గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్, పడాల సతీశ్, రాష్ట్ర నాయకులు పాండుగౌడ్, నరేశ్, విశాల్, రాజేశ్‌నాయక్, క్రాంతి, ప్రశాంత్, కమల్, అంజద్, మహబూబ్, రాజ్‌కరణ్, చింటు, అఖిల్, శశాంక్‌రెడ్డి,హేమంత్,అభిలాశ్, నీరజ్ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనూనాయక్ తన పాటలతో అలరించారు. అంబర్‌పేటలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్ బృం దం పర్యటించింది. జియాగూడలోని కేసర్ హనుమాన్ ఆల యం, పటేల్ హోటల్ ప్రాంతాల్లో నితీశ్, నవీన్ బృందం ఇం టింటికీ తిరిగి ప్రభుత్వం తీరును వివరించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిష్కల్ రెడ్డి, అఖిరా నందన్ పర్యటించారు.