BRSV Quthbullapur Incharge : అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని బీఆర్ఎస్వీ కుత్బుల్లాపూర్ ఇంచార్జి బి.రవి కిరణ్(Ravi Kiran) అన్నారు. తెలంగాణలో ఎవరైనా స్వేచ్ఛగా తమ నిరసనలు తెలుపవచ్చు అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు, మాటల వరకే పరిమితం అయ్యాయని ఆయన మండిపడ్డారు.
విద్యారంగంలో సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బీఆర్ఎస్వీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని కుత్బుల్లాపూర్ ఇంచార్జి బి.రవి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అరెస్ట్‌ల ద్వారా ప్రజా వ్యతిరేకత నుండి ప్రభుత్వం తప్పించుకోలేదని విద్యార్థి విభాగం నుండి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాని ఆయన తెలిపారు. అక్రమ అరెస్టుల ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నో రోజులు నడపలేరని రవి కిరణ్ ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి.. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాల్సిందిగా కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.