హైదరాబాద్ : నేడు నాగోల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. కేటీఆర్ వస్తున్నారనే వియషయం తెలియడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎసంసీ సిబ్బంది నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతాన్ని కార్మికులతో శుభ్రం చేయించారు. మొక్కలకు నీళ్లు పడుతుండటం విశేషం. కాగా, ఇండ్లు కూల్చకుండా, భూములు లాక్కోకుండా తక్కువ ఖర్చుతో మూసీని ఎలా సుందరీకరించవచ్చో ఈ పర్యటనలో కేటీఆర్ ప్రజలకు వివరిస్తారు.
మూసీ మురుగును పారదోలేందుకు చేపట్టే పనుల గురించి చెప్తారు. సాయంత్రం 6 గంటలకు మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్లో ఇఫ్తార్ విందుకు హాజరవుతారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యేలు కాలేరు వంకటేష్, సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.