KTR | నాచారంలోని సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, మూసీ పేరుతో లూటీ చేస్తే మాత్రం ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ని ఆదరించిన హైదరాబాద్‌ను ఆగం కానియ్యమని, ఇక్కడి పేదలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
కేటీఆర్ వెంట ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వివేకానంద్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు శాంతిసాయిజెన్శేఖర్, బన్నాల గీతా ప్రవీణ్, పన్నాల దేవేందర్‌రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, శిరీషా సోమశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
-ఉప్పల్, అక్టోబర్ 27