ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో రూపొందించిన చలో వరంగల్ వాల్ పోస్టర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 22: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి లతోపాటు కుత్బుల్లాపూర్ ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు మంగళవారం నగరంలోని నంది హిల్స్ లోని కేటీఆర్ నివాస కార్యాలయానికి వెళ్లి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభకు కుత్బుల్లాపూర్ నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నియోజక వర్గంలో ప్రతి ఒక్కరూ జెండాలు ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా, ఏప్రిల్ 22 : రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు,కార్యకర్తలు తరలి రావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మంగళవారం ఏఎస్ రావు నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ నియోజక వర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత వరంగల్ వేదికగా ఎండగట్టాలని అన్నారు. 2 రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉప్పల్ నియోజకవర్గం వ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేయాలని శ్రేణులను కోరారు. ‘రేవంత్ రెడ్డి పాలన ఫెయిలయిందని హైడ్రా పేరుతో పేదప్రజల జీవితాలు నాశనం చేసిండు, భూము ల అమ్మకాల పేరుతో మూగజీవాల గోస పోసుకు న్నాడు, మూగజీవాలు రేవంత్ రెడ్డిని క్షమించవు’ అని విమర్శించారు. సమావేశంలో కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ ల అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కందుకూరు, ఏప్రిల్ 22 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మండల కాంగ్రెస్ నాయకులు సభావ త్ లచ్చా నాయక్, పెద్దమ్మ తండా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సభావత్ సుమన్ నాయక్ తదితరులు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ తోనే ఉజ్వల భవిష్యత్ ఉందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ 420 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేక పోయిందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి మోసపోయామని లచ్చానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.