KTR | మన్సురాబాద్, మార్చి 11: ఇటీవల రోడ్డు ప్రమాదంలో ముసరాంబాగ్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. కనిష్క్ రెడ్డి సంతాప సభను మంగళవారం నాగోల్ బండ్లగూడలోని పీబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కనిష్క్ రెడ్డి చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కనిష్క్ రెడ్డి తల్లిదండ్రులు అజిత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సునరిత రెడ్డిలను కేటీఆర్ పరామర్శించారు. పరామర్శించిన వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.