KTR | చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కేటీఆర్.. రెండేండ్ల ఫీజు చెల్లింపు
KTR | చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది.
KTR | హైదరాబాద్ : చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది. సరైన పత్రాలు లేకపోవడం హైదరాబాద్ సనత్ నగర్ దాసారం బస్తీకి చెందిన మల్లెల శ్రీవిద్య అడ్మిషన్‌ను స్కూల్ యాజమాన్యం రద్దు చేసింది. బాగా చదువుకోవాలని ఆశపడ్డ శ్రీవిద్యకు ఆధార్ రూపంలో ఎదురైన సమస్య గురించి పత్రికలో వచ్చిన వార్తకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
తన కార్యాలయ సిబ్బందిని శ్రీవిద్య ఇంటికి పంపించి తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ఇప్పించడంలో సహాయం చేస్తామన్నారు. ఇంతేకాదు శ్రీవిద్య తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్, ఆమె చదువు ఆగిపోవద్దనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల స్కూల్ ఫీజును చెల్లించారు. భవిష్యత్తులో శ్రీ విద్య చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని చెప్పారు. కేటీఆర్ చొరవతో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి అవసరమైన సర్టిఫికెట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
తమ సమస్య గురించి తెలుసుకుని శ్రీవిద్య జీవితానికి కొత్త వెలుగు అందించిన కేటీఆర్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పత్రికలో వార్త వచ్చిన తరువాత అధికారులు నామమాత్రంగానే స్పందించారని చెప్పారు. రెండు సంవత్సరాల ఫీజు ముందే కట్టడంతో పాటు భవిష్యత్తులోనే శ్రీవిద్య చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానన్న కేటీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
TeluguScribe Fact Check
కోట నీలిమ అనే ఆమె బుక్స్ కొనిచ్చి ఫోటోలు దిగి ఎలాంటి సహాయం చేయకుండా వెళ్లిపోయింది
మేము చెత్త ఏరుకునే వాళ్ళం, స్కూల్ ఫీజ్, యూనిఫాం కొనడానికి డబ్బులు లేవు, ఆమె ఇవేమీ వినిపించుకోకుండా వెళ్లిపోయింది – శ్రీవిద్య తల్లి మమత https://t.co/aRlvCoJe8p pic.twitter.com/orwAN3ZfUW
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2025
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

