మళ్లీ వచ్చేది గులాబీ జెండాయే, సీఎం అయ్యేది కేసీఆర్‌యే.. నాడు 24 గంటల కరెంట్ ఎలాగైతే ఇచ్చామో, అధికారంలోకి రాగానే మహానగరంలో 24 గంటల ఉచిత తాగునీరు ఇచ్చే బాధ్యత కూడా నాదే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూకట్పల్లి వేదికగా మాట ఇచ్చారు. సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు.నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కాంగ్రెస్ వల్లనే దెబ్బతిన్నదని, దీంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ,సెంట్రింగ్ కార్మికుల కోసం బీమా అమలు చేస్తామన్నారు.
– సిటీబ్యూరో/ కూకట్పల్లి, మే 25 (నమస్తే తెలంగాణ)

Ktr
కార్యకర్తలే కొండంత అండ
పదేళ్లుగా అభివృద్ధే ధ్యేయంగా ఒక తపస్సులా పనిచేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపామని కేటీఆర్ గుర్తుచేశారు. పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు ఇంతమంది కార్యకర్తలు అండగా నిలబడి ధైర్యం చెప్పడం అభినందనీయమన్నారు. ‘రాబోయే రోజుల్లో పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్తను, ఉద్యమ బిడ్డను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది. పదవుల రూపంలోనో, పనుల రూపంలోనో మిమ్మల్ని కాపాడుకుంటాం’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కూకట్ పల్లిలో గతంలో 9 డివిజన్లు ఉంటే, ఇప్పుడు అవి 15 డివిజన్లుగా మారాయని, వీటన్నింటికి కొత్త కమిటీలను వేసుకోబోతున్నామని తెలిపారు.
కష్టకాలంలో కూడా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పోయినా గులాబీ జెండాను విడవకుండా నిలబడిన కూకట్పల్లి నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్ల నిబద్ధతను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుర్మయగారి నవీన్ రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, సీనియర్ నాయకులు గజ్జెల నగేశ్, రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు మందాడి సత్యనారాయణ, జూపల్లి సత్యనారాయణ, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, శ్రవణ్, పండాల సతీశ్‌గౌడ్, సబిహాబేగం, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Ktr
సిటీబ్యూరో/ కూకట్పల్లి, మే 25 (నమస్తే తెలంగాణ) ఒకప్పుడు కూకట్పల్లి ప్రాంతంలో తాగునీటి కోసం మహిళలు పడిన అగచాట్లను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఇకడ మంచి నీళ్లకు ఎన్ని తిప్పలు ఉండేవో ఒకసారి ఆలోచించాలని, ట్యాంకర్ల రాజకీయం, బిందెల ప్రదర్శనలు చూశామని వివరించారు. ఎండాకాలం వస్తే చాలు జలమండలి ముందు ఖాళీ కుండలతో మన ఆడబిడ్డలు ధర్నాలు చేసిన దుస్థితి ఉండేదని..ప్రస్తుతం నగరంలో మళ్లీ నీళ్లు, కరెంట్ సమస్యలు మొదలయ్యాయని, వాటర్ ట్యాంకర్ల మాఫియా రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న పార్టీ కార్యక్రమాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటుంటే, మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కూర్చుందని, పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీని పాతరేశారు’ అని విమర్శించారు. కూకట్పల్లి ప్రజలు కాంగ్రెస్ దొంగ గ్యారంటీలను నమ్మకుండా, వివేకవంతంగా ఆలోచించి 72 వేల ఓట్ల భారీ మెజారిటీతో, రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతంతో మాధవరం కృష్ణారావును గెలిపించారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ పాలన గురించి అవగాహన ఉన్న కారణంతోనే నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక సీటూ ఇవ్వలేదని గుర్తుచేశారు.
ఇది దుర్మార్గపు ప్రభుత్వం..
తెలంగాణ ఏర్పడక ముందు తీవ్రమైన కరెంటు కోతలు తాగునీటి కష్టాలు ఉండేవని కేటీఆర్ గుర్తు చేశారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో కనీసం కరెంట్ సరఫరా నీటి సరఫరా చేయలేని దుస్థితి ఉండేదని, తాగునీరు, కరెంటు కోసం ధర్నాలు నిరసన కార్యక్రమాలు జరిగేవని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పట్టుదలతో 24 గంటల కరెంటు అందించామన్నారు. అదే విధంగా ప్రతి ఇంటికి పైప్‌లైన్‌తో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద నగర వ్యాప్తంగా 42 ఫె్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామని, అందులో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి మేరకు జేఎన్టీయూ ఫె్లైఓవర్, అలాగే బాలానగర్ ఫె్లైఓవర్ను నిర్మించి ఇకడి ప్రజల దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలను తీర్చామని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య పరిషారం, రోడ్ల విస్తరణ, మెట్రో రైలు వంటి మౌలిక వసతుల కల్పనతో కూకట్పల్లి ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా ఎంతగానో వృద్ధి చెందిందని తెలిపారు. నాడు కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ. 1,00,116 అందించి ఆడబిడ్డల పెళ్లిళ్లకు పెద్దన్నలా నిలిస్తే.. కాంగ్రెస్ తులం బంగారం ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలతో అరాచకం సృష్టిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. జీవో నంబర్ 58, 59ల కింద హైదరాబాద్ మహానగరంలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రెండున్నర లక్షల మంది పేదలకు పట్టాలిచ్చి అండగా నిలిచిన మహానాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని, హైదరాబాద్‌లో ఒక ఇల్లు కూడా కట్టలేదని దుయ్యబట్టారు.
హైడ్రా నోటీసుల భయంతో బుచ్చమ్మ అనే మహిళా బాలానగర్‌లో తన బిడ్డ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఇల్లు కూలిపోతుందనే తీవ్ర మనస్తాపంతోనే బుచ్చమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బుచ్చమ్మే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్‌లోని దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్‌లో మూసీ పరీవాహక ప్రాంతాల్లో కావచ్చు.. వేలాది మంది గరీబోళ్ల ఇళ్లను, కొంపలను ఇష్టమొచ్చినట్టు కూలగొడుతున్న ఒక చెత్త, దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.

Ktr
వైద్య రంగంలో విప్లవం..
కరోనా కష్టకాలంలో ప్రజలు పడిన ఇబ్బందులను చూసి, భవిష్యత్తులో మన పిల్లలకు ఇలాంటి దుస్థితి రాకూడదని కేసీఆర్ హైదరాబాద్ నలుమూలలా వైద్య విప్లవానికి నాంది పలికారని కేటీఆర్ గుర్తుచేశారు. నగరంలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి, పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం, మందులు అందించామన్నారు. ‘డీ హబ్’ పేరిట 24 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తప్ప ఒక కొత్త ఆసుపత్రి కూడా కట్టలేదని విమర్శించారు.
కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్, గచ్చిబౌలిలలో ఒకొకటి 1000 పడకల సామర్థ్యంతో నాలుగు ప్రతిష్టాత్మక ‘టిమ్స్’ఆసుపత్రులను నిర్మించిందని, అందులో మూడో వంతు ఐసీయూ పడకలేనని స్పష్టం చేశారు. అలాగే నిమ్స్ ఆసుపత్రిలో మరో 2000 పడకలను విస్తరించిన ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారని ఆయన జేబుదొంగ కాదు.. గజదొంగ, దండుపాళ్యం బ్యాచ్‌కు నాయకుడు అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తాము కట్టిన ఫె్లైఓవర్లు, తాము నిర్మించిన టిమ్స్ ఆసుపత్రులు, తాము కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయనే స్వయంగా పోయి రిబ్బన్లు కట్ చేస్తూ తానే కట్టినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
సర్వేల ఆధారంగానే టికెట్లు..
సరిగా పనిచేసే కార్పొరేటర్లు, నాయకులకు రాబోయే రోజుల్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల మార్పులు సహజమని, అయితే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, బస్తీలు, గల్లీలు తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడే యువ రక్తం, చాకుల్లాంటి నాయకులకే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. జూన్‌లో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం 45 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఈసారి పూర్తి డిజిటల్ పద్ధతిలో మెంబర్ షిప్ ప్రక్రియ ఉంటుందని, దీని కోసం ప్రతి బూత్ నుంచి ఇద్దరు యువతీ యువకులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని ప్రకటించారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై బూత్ స్థాయి ప్రతినిధులు (బీఎల్ఏ) అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పించడంతో పాటు, ఓట్ల తొలగింపు ప్రక్రియను నిశితంగా గమనించాలన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై బూత్ స్థాయి ఏజెంట్లు అనుసరించాల్సిన వ్యూహాలు, నిబంధనలతో కూడిన ప్రత్యేక ఎస్ఐఆర్ హ్యాండ్ బుక్‌ను, డిజిటల్ ప్రెజెంటేషన్‌ను కేటీఆర్ ఆవిషరించారు. ఈ పుస్తకాలను సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులకు పంపిణీ చేశారు. ప్రతి బూత్ ఏజెంట్ ఈ నిబంధనలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఓట్ల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్ కోరారు.