బాలానగర్, మార్చి 18 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పల్లి వల్లభ నగర్లో తెలంగాణ స్కూల్ వ్యాన్, క్యాబ్ డ్రైవర్స్ సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ఓల్డ్ బోయిన్పల్లి బీఆర్ఎస్ శ్రేణులు, వ్యాన్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు.
అనంతరం హస్మత్ పేట బడి మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మైనార్టీలకు పండ్లు అందజేసి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలు అయోమయానికి గురవుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ప్రజలు ఆరోపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తో (మిగతా IVవ పేజీలో)