చంపాపేట, ఏప్రిల్ 26: వరంగల్లో నేడు జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్ లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై పార్టీ శ్రేణులతో కలిసి జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ….
నేడు వరంగల్ లో జరిగే పార్టీ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేట్లు ఆయా డివిజన్లో బాధ్యులు కృషి చేయాలని సూచించారు. పార్టీ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేసే ప్రతి కార్యకర్తకు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ సభను మన ఇంటి పండుగగా భావించి పార్టీ శ్రేణులు అందరూ సభకు తరలి రావడంతో పాటు పార్టీ సానుభూతిపరులను సభకు తరలించుకు రావాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిలక్ రావు, రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు, పార్టీ పలు విభాగాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు : సబితా ఇంద్రారెడ్డి
బడంగ్ పేట్, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వరంగల్ లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవాలకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి 40 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 200 సొంత కార్లల్లో ర్యాలీగా వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 42 ప్రైవేట్ బస్సులను కూడా బుక్ చేసుకోవడం జరిగిందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారని తెలిపారు. కేసీఆర్ అంటేనే ప్రజలకు ఒక్క బలమైన నమ్మకం ఉందన్నారు. రాష్ట్రమంతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు, రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన నాయకుడు కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ర్టానికి శ్రీరామరక్ష అన్నారు.
పార్టీ జెండాలను ఎగురవేసిన నేతలు
బడంగ్ పేట్, ఏప్రిల్ 26: వరంగల్లో నేడు నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు మహేశ్వరం నియోజకవర్గం అంతా ముస్తాబు అయింది. గులాబీ జెండాల తోరణాలు, ‘చలో వరంగల్’ వాల్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రా రెడ్డి ఆదేశానుసారం ఆదివారం ఉదయం 08:30 గంటల నుండి గులాబీ జెండాలను ఆవిష్కరించి ‘చలో వరంగల్’కు బయలుదేరుతారు. మీర్ పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్ చౌరస్తా లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు.
మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ, మీర్ పేట్ పరిధిలో గల వివిధ డివిజన్లలో జెండా ఎగురవేయడంతో రజతోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు దుర్గా దీప్ లాల్ చౌహాన్, తీగల విక్రమ్ రెడ్డి, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, లావణ్య బీరప్ప, మేకల రవీందర్ రెడ్డి, బొక్క రాజేందర్ రెడ్డి, రేఖ లక్ష్మణ్, యం.ఏ రజాక్, బీఆర్ఎస్ మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, శ్రీను నాయక్, బి.ఆర్.యస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధాల భారత్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిరూర్ బాల్ రాజ్, సుదర్శన్ రెడ్డి, వంటేరు నరసింహ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు హాము నాయక్, నర్సిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నాయకులు శిశుపాల్ రెడ్డి, అవినాష్, గోపి యాదవ్, రామకృష్ణ, అర్జున్, యాదగిరి, చారి, సహదేవ్, సుదర్శన్ ,శేఖర్ గౌడ్, మీర్ పేట్ మహిళా అధ్యక్షురాలు సునీత బాల్ రాజ్, విజయలక్ష్మి, గ్రంథాలయ మాజీ డైరెక్టర్ పి.మాధవి, లతా శేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుక్కుగూడలో..
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారంగా తుక్కుగూడ మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ సామెల్ రాజ్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవి నాయక్, ప్రెసిడెంట్ ప్రవీణ్ లావణ్య శ్రీధర్ రెడి,్డ సుధాకర్, శ్రీధర్, మహేష్, భరత్, జయరాజ్, రాజు పాల్గొన్నారు.
వరంగల్ సభకు భారీగా తరలుతాం
ఎల్బీనగర్, ఏప్రిల్ 26: వరంగల్ సభకు భారీ గా తరలుతామని బీఆర్ఎస్ ఎస్సీ విభాగం నాయకులు అన్నారు. బీఆర్ఎస్ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లెపాక యాదగిరి, పార్షపు శ్రీధర్, ఎర్పుల గాలయ్య, బాలాజీ గైక్వాడ్, చాన్ పాషా, ఆకుల వెంకటేష్, తొలకోప్పుల చక్రవర్తి తదితరులు ఎల్బీనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధ్వర్యంలో వరంగల్ సభకు భారీ వాహనాలతో ర్యాలీగా బయలుదేరుతామన్నారు.